Breaking News

అందుకే అంతా బెంగళూరు చేరారు: ప్రధాని మోదీ

Published on Tue, 07/18/2023 - 11:48

సాక్షి, ఢిల్లీ: బెంగళూరులో విపక్ష కూటమి సమావేశం జరుగుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ విసుర్లు విసిరారు. పోర్ట్‌ బ్లెయిర్‌లో వీరసావర్కర్‌ ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను మంగళవారం వర్చువల్‌గా ఢిల్లీ నుంచే ప్రారంభించిన ఆయన.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.  

కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేశాయి. ప్రతీకార రాజకీయాలకు పాల్పపడ్డాయి. కానీ, యూపీఏ హయాంలో జరిగిన తప్పులను మేం సరిదిద్దాం. అందుకే ఈ  తొమ్మిదేళ్లలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించింది అని తెలిపారాయన. సొంత లాభాల కోసమే విపక్షాలు పని చేస్తున్నాయన్న ప్రధాని మోదీ.. గతంలో వాళ్లు గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి అనే మాటెత్తకుండా.. స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నాయంటూ విపక్షాల కూటమిపై విమర్శలు గుప్పించారు. 

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అని ఉంటుంది. కానీ, కుటుంబ రాజకీయాలను ప్రొత్సహించే పార్టీల్లో.. కుటుంబాల కోసమే, కుటుంబాల చేత, కుటంబాల కొరకే అని ఉంటుంది. దేశం కోసం వాళ్లేం చెయ్యరు. అందుకే విద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు ఉంటాయి. కేవలం వాళ్ల కుటుంబాలే ఎదగాలనుకుంటున్నాయి. పేదల గురించి ఎలాంటి ఆలోచనలు చెయ్యరు అంటూ విపక్షాలపై మండిపడ్డారు.

దేశ ప్రజలు మమ్మల్ని 2024 అధికారంలోకి మళ్లీ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకే బెంగళూరు చేరి.. వాళ్లు(విపక్షాలను ఉద్దేశించి) తమ​ దుకాణాలు తెర్చుకున్నారు. 24 కే లియే 26 హోనే వాలే రాజనైతిక్ దలోన్ పర్ యే బడా ఫిట్ బైత్'తా హై అంటూ పాటలు పాడుతున్నారు. కానీ, వాస్తవం మరోలా ఉంది. వాళ్ల దుకాణాల వద్ద కులతత్వం అనే విషం, అపారమైన అవినీతి అనే హామీలే ఉంటాయి అని ఎద్దేవా చేశారాయన. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)