Breaking News

అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది: ప్రధాని మోదీ 

Published on Tue, 10/03/2023 - 15:00

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ జగ్దల్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన దేశం అభివృద్ధి చెందాలంటే మొదట రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. 

ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలో భాగంగా మొదట జగ్దల్‌పూర్‌లోని బస్తర్‌ దంతేశ్వరి ఆలయంలో ప్రధాని జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ రాష్ట్రంలో మొత్తం రూ.26,000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఆయన నాగర్నార్‌లోని ఎన్ఎండీసీ స్టీల్‌ప్లాంట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. పలు రైల్వే ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టిన ప్రధాని వాటిని జాతికి అంకితం చేశారు. 

ఈ సందర్బంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక 2014 తో పోలిస్తే ఇక్కడ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి దాదాపు 20 రెట్లు బడ్జెట్ పెంచామని అన్నారు. అలాగే ఈ ఎన్ఎండీసీ స్టీల్‌ప్లాంట్‌ వలన ఇక్కడి పరిసర ప్రాంతాల్లోని సుమారు 50,000 మందికి ఉపాధి లభించనుందని అన్నారు.         

ఇది కూడా చదవండి: 'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..'

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)