Breaking News

‘మమత’ రాష్ట్రంలో మోదీ రికార్డు.. ఏ ప్రాంతాన్నీ వదలని ప్రధాని?

Published on Wed, 05/29/2024 - 10:00

పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా ప్రధాని మోదీ ఈ ఏడాది ఏకంగా 22 ర్యాలీలు నిర్వహించారు. ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్‌లో ఏ ప్రధాని కూడా ఇన్ని ర్యాలీలు చేపట్టలేదు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ‍ప్రధాని మోదీ తాను చేపట్టే ర్యాలీలతో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతీ ప్రాంతాన్నీ కవర్‌చేసే ప్రయత్నం చేశారు. ఈసారి పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలెవరూ ఇక్కడ ర్యాలీలు చేపట్టకపోవడం విశేషం. మార్చి 16న ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బెంగాల్‌లో భారీ ర్యాలీలు నిర్వహించారు. నేడు (బుధవారం) నిర్వహించే రెండు ర్యాలీలతో మోదీ పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది మొత్తం 22 ర్యాలీలు నిర్వహించినట్లవుతుంది.

2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ బెంగాల్‌పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని అవినీతి, బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు తదితర అంశాలతో ప్రధాని మోదీ అధికార తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.  అలాగే రాష్ట్రంలో సీఏఏపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. సందేశ్‌ఖాలీలోని మహిళల అణచివేతపై దుమ్మెత్తిపోశారు. సందేశ్‌ఖాలీ  ప్రాంతంలోని మహిళలకు న్యాయం చేసే విధంగా ఆ ప్రాంతానికి చెందిన రేఖా పాత్రకు టికెట్  ఇచ్చారు. ఈ విధంగా ‍ప్రధాని మోదీ మహిళలకు బీజేపీ  అండగా ఉంటుందనే సందేశాన్ని అందించారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)