Breaking News

గబ్బాడ యార్డులో రూ.5 కోట్ల ఇసుక మయం

Published on Tue, 07/09/2024 - 04:56

నర్సీపట్నం: కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత టీడీపీ నాయకులు పాల్పడిన ఇసుక దోపిడీపై విచారణ చేపట్టి, దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భారీఎత్తున ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలకు ముందు నర్సీపట్నం గబ్బాడ యార్డులో లక్ష టన్నుల ఇసుక ఉండేదన్నారు.

ఫలితాలు వెలువడిన మరుసటి రోజే టీడీపీ నాయకులు యార్డును స్వా«దీనం చేసుకున్నారని చెప్పారు. లక్ష టన్నులు ఉండాల్సిన ఇసుక ప్రస్తుతం 48 వేల టన్నులే ఉందని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యార్డులోని రూ.5 కోట్లు విలువ చేసే ఇసుకను వాహనాల్లో తరలించి టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు.

యార్డులోని 60 వేల టన్నుల ఇసుకను మాయం చేశారన్నారు. గబ్బాడ ఇసుక దోపిడీపై అధికారులు సమగ్రమైన విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని చెప్పారు.  ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురిచేసిందని గణేష్‌ దుయ్యబట్టారు. ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారన్నారు. పార్టీ సీనియర్‌ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)