Breaking News

పచ్చబ్యాచ్‌ ఆగడాలు.. లిక్కర్‌ షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్‌

Published on Mon, 10/14/2024 - 18:39

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పచ్చబ్యాచ్‌ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. హిందూపురం నియోజకవర్గంలో దౌర్జన్యానికి దిగారు. మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తిని కిడ్నాప్‌ చేశారు. లేపాక్షి మద్యం షాపును లాటరీలో దక్కించుకున్న రంగనాథ్‌ను.. లాటరీ ఫలితం వచ్చిన వెంటనే టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. రంగనాథ్‌ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు టెండర్‌ వేసే ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు.. వారి పీఏలు, అనుచరుల కనుసన్నల్లోనే జరిగింది. ప్రతి దుకాణం తమకు, తమ అనుచరులు చెప్పిన వారికే దక్కే విధంగా టీడీపీ నేతలు ముందస్తు ప్లాన్‌ చేశారు. దీంతో ఆరంభం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలా చోట్ల సింగిల్‌ డిజిట్‌లో దరఖాస్తులు ఉండటం గమనార్హం.

జిల్లా వ్యాప్తంగా 87 షాపులకు 1,460 దరఖాస్తులు అందాయి. మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం టీడీపీ వర్గీయులకు సంబంధించినవే. మిగతా 20 శాతం మంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బరిలో దిగారు. అయితే వారందరికీ ఇప్పటికే వార్నింగ్‌లు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ లాటరీలో దుకాణం దక్కించుకున్నా వదిలి వెళ్లాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ నేతలు బెదిరింపులు మొదలుపెట్టారు. ఎవరు దరఖాస్తు చేసిన ఖబడ్దార్‌ అంటూ ఫోన్లలో వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో చాలామంది ఔత్సాహికులు వెనక్కి తగ్గారు. కాగా ఆన్‌లైన్‌ విధానం అందుబాటులో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తులు చేశారు.

బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్

ఇదీ చదవండి: అవినీతి కోసం వేసిన స్కెచ్‌ కాదా బాబూ?: వైఎస్‌ జగన్‌

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)