Breaking News

నోట్‌ దిస్‌ పాయింట్‌.. రూ.50 వేల వరకు తీసుకెళ్లేందుకు అనుమతి 

Published on Thu, 10/12/2023 - 05:24

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ సోమవారం వెలువడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు విభాగం ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుచేయడం ప్రారంభించింది. ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి వినియోగించే అక్రమ మద్యం, నగదుపై డేగకన్ను వేసింది.

సోమ, మంగళవారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి స్వా«దీనం చేసుకుంది. ఎన్నికల క్రతువు ముగిసేవరకు ఈ తనిఖీలు సాగనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వృత్తి, వ్యాపార, క్రయవిక్రయాల కోసం నగదు తరలించే వారిలో అనేక సందేహాలున్నాయి. కోడ్‌ అమల్లో ఉన్నంత కాలం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు. 

రూ.50 వేలకు మించితే... 
ఓ వ్యక్తి తన వెంట రూ.50 వేల వరకు మాత్రమే నగదును తీసుకెళ్లవచ్చు. అంతకుమించిన మొత్తం తీసుకెళ్లాలంటే దాని మూలాలను నిరూపించే ఆధారాలు కచ్చితంగా కలిగి ఉండాలి. వ్యాపారులు దానికి సంబంధించిన పత్రాలు, లావాదేవీల బిల్లులు కలిగి ఉండాల్సిందే. సాధారణ వ్యక్తులు తీసుకెళ్తుంటే బ్యాంకు నుంచి డ్రా చేసిన పత్రాలు లేదా ఆ నగదు ఎక్కడ నుంచి వచి్చందో, ఎందుకు వినియోగిస్తున్నామో చెప్పడానికి అవసరమైన ఇతర ఆధారాలు చూపించాలి. 

♦ రూ.2 లక్షలకు మించిన నగదు తలింపును మాత్రం పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ మొత్తం తమ వద్దకు ఎలా వచి్చంది? ఏం చేయబోతున్నారు? అనే వాటికి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో పోలీసులు నగదు స్వా ధీనం చేసుకుంటారు. ఇలా సీజ్‌ చేసిన నగదు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే అది జిల్లా ఎన్నికల అధికారి నియమించే కమిటీ వద్దకు వెళ్తుంది.  

♦ నలుగురు సభ్యులతో ఉండే ఈ జిల్లా కమిటీ ఎదుట నగదు యజమాని హాజరై నగదు మూలం, అవసరాలకు సంబంధించి వివరణ ఇవ్వాలి. దీనిపై కమిటీ సంతృప్తి చెందితే నగదు తిరిగి అప్పగిస్తుంది. లేదంటే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఆదేశిస్తుంది.  

♦  పోలీసులు స్వాదీనం చేసుకున్న నగదు రూ.10 లక్షలకు మించితే విషయం ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. నగదును స్వా«దీనం చేసుకునే ఆ అధికారులు బాధ్యులకు నోటీసులు జారీ చేస్తారు. వారిచ్చే సమాధానాన్ని వివిధ కోణాల్లో పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటారు.  

♦  కొత్త బంగారం, వెండి నగలు, వస్తువులతోపాటు గిఫ్ట్‌ ఆర్టికల్స్, కుక్కర్లు, క్రికెట్‌ కిట్స్‌ వంటి సామగ్రి విలువ రూ.10 వేలకు మించితే పోలీసులు స్వా«దీనం చేసుకుంటారు. యజమానులు వాటిని వ్యాపార నిమిత్తం తరలిస్తున్నట్లు పత్రాలు చూపించి, నిరూపించుకుంటేనే తిరిగి అప్పగిస్తారు. లేదంటే విషయం ఎన్నికల అధికారుల వద్దకు వెళ్తుంది.  
♦ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సైతం తాము ఖరీదు చేసే ప్రచార, ఇతర సామగ్రికి సంబంధించి విక్రేతలకు రూ.10 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయకూడదు. అంతకంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయాలంటే చెక్కులు, ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే చేయాలి. అభ్యర్థి లేదా అతని ఏజెంట్‌ కూడా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు.  

♦ పోలీసులు స్వా«దీనం చేసుకున్న నగదు (రూ.50 వేలలోపు అయినా), వస్తువులు (రూ.10 వేల కంటే తక్కువ విలువైనవి అయినా) ఓటర్లను ప్రలోభ పెట్టడానికని ఆధారాలు లభిస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. బాధ్యులపై ఐపీసీ 171(బీ) రెడ్‌విత్‌ 171(సీ) సెక్షన్లతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్‌ 123 ప్రకారం వీటిని రిజిస్టర్‌ చేసి దర్యాప్తుచేస్తారు. బాధ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశమూ ఉంది. 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)