Breaking News

హైడ్రా పేరిట వసూళ్లు నిరూపిస్తే మూసీలో దూకుతా: మహేశ్‌గౌడ్‌

Published on Thu, 10/03/2024 - 05:01

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏం చదువుకున్నారో అర్థం కావడం లేదని, రాహుల్‌ గాం«దీకి, మూసీకి, హైడ్రాకు ఏం సంబంధముందని ఆయన మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ప్రశ్నించారు. హైడ్రా పేరిట వసూళ్లు చేసినట్టు నిరూపిస్తే తాను పురానాపూల్‌ బ్రిడ్జి మీద నుంచి మూసీలో దూకుతానని, లేదంటే కేటీఆర్‌ దూకాలని ఆయన సవాల్‌ చేశారు. 

బుధవారం గాం«దీభవన్‌లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో కలసి ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ నేతలు యథేచ్ఛగా కబ్జాలు చేశారని, అందుకే హైడ్రా అనగానే భయాందోళనలకు గురవుతున్నారని వ్యా ఖ్యానించారు. చెట్లు, లిక్కర్, ఇరిగేషన్‌ పేరు మీద దోచుకుని రా ష్ట్రాన్ని లూటీ చేశారని, ఇప్పుడు ఆ సొమ్ముతో సోషల్‌మీడియాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. 

మూసీ చుట్టూ ఉన్న ఒక్క ఇల్లును కూడా ఇప్పటివరకు తొలగించలేదని, ఒకవేళ తొలగించాల్సి వచ్చినా చట్టబద్ధంగా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. అసలు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు, హైడ్రాకు సంబంధం లేని, డీపీఆర్‌ తయారు కాకుండానే మూసీ అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందో ఎలా చెప్తామని ప్రశ్నించారు. 

మూసీ సుందరీకరణకు సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ గురించి అసభ్యంగా ట్రోల్‌ చేసిన విషయంలో బావకు ఉన్న సోయి బావమరిదికి లేదని, అందుకే కేటీఆర్‌ ట్రోల్స్‌ని ఖండించలేదని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మహేశ్‌గౌడ్‌ ఈ సందర్భంగా చెప్పారు.

మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది: మంత్రి సురేఖ 
బీఆర్‌ఎస్‌లో రాజకీయంగా మహిళలను ఎదగనివ్వరని మంత్రి కొండా సురేఖ అన్నారు. అందుకే బొడిగె శోభ, రేఖానాయక్‌తో పాటు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కుటుంబ పాలన నడవాలి కాబట్టే తమకు పదవులు ఇవ్వలేదని చెప్పారు. తనపై సోషల్‌మీడియాలో చేసిన కామెంట్లను మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుందని చెప్పారు. 

తాము బీఆర్‌ఎస్‌ లాగా సోషల్‌మీడియాను దురి్వనియోగం చేయబోమన్నారు. మూసీ చుట్టూ ఉన్న ఇళ్లను కూల్చకముందే బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన సురేఖ.. బతుకమ్మ పండుగకు ఏమివ్వాలన్న దానిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)