Breaking News

నాగబాబుకు మంత్రి పదవిపై పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 12/30/2024 - 14:37

సాక్షి,అమరావతి : నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వడం లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పవన్‌ మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..‘భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు.గతంలో జరిగిన ఎన్నికల్లో నాకు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు వేయలేదు. అందుకే ఇక్కడ అన్నింటిని పక్కన పెట్టి ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నాను.

బీసీ, ఎస్సీ,ఎస్టీలు,అధికార, ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారు. జనసేన బలమైన పార్టీగా ఎదిగేదాకా నాకు ఆ వర్గాల నుంచి మద్దతు దొరకడం కష్టం. నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వడం లేదు. నాతో సమానంగా పనిచేశారు. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఇంకెవరు ఉన్నా ఇచ్చే వాళ్లం.  

కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు.నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత నాతో కలిసి చేసి ఉంటే వాళ్ళకే కేబినెట్‌ పదవి ఇచ్చే వాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళను వారసత్వంగా చూడలేం. మొదట ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబు కేబినెట్‌లోకి వస్తారు. వచ్చే ఏడాది మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు’ అని వ్యాఖ్యానించారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)