Breaking News

ఎన్నో అవమానాలు భరించా: జగ్‌ధీప్‌ ధన్‌ఖడ్‌

Published on Sun, 12/24/2023 - 14:54

న్యూఢిల్లీ:  రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌  తాను  ఎన్నో అవమానాలు, బాధలు భరించిన వ్యక్తినని అన్నారు. పార్లమెంట్‌ భద్రత వైఫల్యంపై విపక్ష ఎంపీలు కేంద్ర హోం మంత్రి స్పందించాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాల ఎంపీలు  సస్పెన్షన్‌కు గురయ్యారు. దానిని ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ.. జగదీప్‌ ధన్‌ఖడ్‌ హావభావాలను అనుకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ధన్‌ఖడ్‌.. తనను, తన కులాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు కూడా. 

అయితే తాజాగా ఆయన ఈ వ్యవహారంపై ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీసు(ఐఎస్‌ఎస్‌) ప్రొబేషనర్లు ఏర్పాటు చేసిన ఓ కర్యక్రమంలో మాట్లాడారు. ‘నేను  ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించిన వ్యక్తిని. అన్ని వైపుల నుంచి వచ్చే అవమానాలు, బాధలను సహించడం నాకు తెలుసు. మనం భారత మాత సేవలో ఉన్నాం’ అని అన్నారు. విమర్శలను తట్టుకోవడం నేర్చుకోవాలని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నప్పటికీ దేశ ప్రజలు తనకు దూరంగా లేరని తెలిపారు.

రాజ్యసభ చైర్మెన్‌గా, ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ హోదాలో ఉన్నప్పటికీ తనను ప్రజలు ఎప్పుడూ విడిచి పెట్టలేదని తెలిపారు. అది తన ఆలోచనా విధానాన్ని మార్చాలా?.. అది తన మార్గాన్ని తప్పుదారి పట్టించాలా? అని అన్నారు. ధర్మ మార్గంలో మనం ఎల్లప్పుడూ ముందుకు సాగాలని తెలిపారు. మన ఎదుగుదలను చూసి ఎవరైతే తట్టుకోలేరో.. అటువంటి వారే ఎ‍ప్పుడూ విమర్శలు చేస్తారని మండిపడ్డారు.

చదవండి:   ‘మార్పు’పై అసంతృప్తి! 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు