Breaking News

లోక్‌సభ నిరవధిక వాయిదా.. ప్రతిపక్ష నేతలపై స్పీకర్‌ ఫైర్‌

Published on Thu, 08/21/2025 - 13:43

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. సమావేశాల్లో భాగంగా 21 రోజుల పాటు జరిగిన లోక్‌సభ నేడు నిరవధికంగా వాయిదా పడింది. ఈ సందర్బంగా విపక్షాల తీరుపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఎక్కువ శాతం నిర‌స‌న‌ల‌తోనే స‌భ గ‌డిచింది. బీహార్‌లో చేప‌ట్టిన ఓట్ల స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్షాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఆ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాల‌ను ప్ర‌భుత్వం మాత్రం ప‌క్క‌న పెట్టేసింది. జాబితా నుంచి 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల తొల‌గింపుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం నుంచి విప‌క్షాలు డిమాండ్ చేశాయి.

నేడు లోక్‌స‌భ‌కు ప్ర‌ధాని మోదీ వ‌చ్చారు. కానీ విప‌క్షాలు మాత్రం త‌మ ప‌ట్టువీడ‌లేదు. విప‌క్షాల తీరుతో విసుగెత్తిన స్పీక‌ర్ ఓం బిర్లా .. స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. విప‌క్షాల వ‌ల్లే ఈసారి స‌భ స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఇక రాజ్య‌స‌భ ఇవాళ మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు వాయిదా ప‌డింది.

ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన 14 బిల్లుల్లో 12 బిల్లులకు లోకసభ ఆమోదం తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌పై అత్యధికంగా 37 గంటలపాటు జూలై 28, 29 తేదీల్లో ప్రత్యేక చర్చ నడిచింది. ఆగస్టు 18న భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై కూడా ప్రత్యేక చర్చ మొదలైనా ప్రతిపక్ష ఎంపీల నిరసనల కారణంగా చర్చ పూర్తికాలేదు. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన జాబితాలో 419 ప్రశ్నలు ఉన్నా, కేవలం 55 ప్రశ్నలపై మాత్రమే చర్చ జరిగింది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)