Breaking News

పార్లమెంట్‌ కొత్త భవనంలోనే ప్రత్యేక సమావేశాలు

Published on Wed, 09/06/2023 - 14:13

ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగ్విజయంగా నూతన పార్లమెంట్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. అయితే.. నూతన పార్లమెంట్‌లో  మొదటి సమావేశాలను వచ్చే ఏడాది ఎన్నిక కానున్న కొత్త ప్రభుత్వమే నిర్వహిస్తుందని అందరూ ఊహించారు. కానీ కేంద్రం ఈ నెల 18-22 వరకు ప్రత్యేక సమావేశాలను కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. 

కొత్త పార్లమెంట్‍లో నిర్వహించనున్న మొదటి సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం తెరమీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు వంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్‌ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నామని స్పష్టం చేసింది. ఈ సెషన్‌ అజెండాను మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఈ సమావేశాల అజెండా ఏంటో తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ఇదీ చదవండి: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలెందుకు?.. ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ


 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)