మీ పార్టీనే బీజేపీలో విలీనం చేస్తారు

Published on Wed, 03/27/2024 - 05:43

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. కేటీ ఆర్‌కు మతిభ్రమించి సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రామ్మోహన్‌రెడ్డి మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు లింగం యాదవ్, కమల్‌తో కలిసి మాట్లాడారు. చెల్లెలు కవిత జైలుకు పోయి కేసులు చుట్టుముడుతుంటే కేటీఆర్‌కు బుర్ర పనిచేయడం లేదన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపించారని, పార్లమెంటు ఎన్నికల్లో చేయడానికి కేటీఆర్‌ దగ్గర ఏమీ లేదని వ్యాఖ్యానించారు. జేబుదొంగ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ప్రజల జేబులు కొట్టి దోచుకున్న రూ.వేల కోట్లను కల్వకుంట్ల కుటుంబం నుంచి కక్కిస్తామని చెప్పారు. ‘దొంగలు కాబట్టే చెల్లి తీహార్‌ జైల్‌లో ఉంది. నువ్వు కూడా చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండు. ఫోన్‌ట్యాపింగ్‌ విచారణ జరుగుతుంటే నువ్వు, నీ కుటుంబం ఎందుకు వణుకుతోంది. ఫోన్‌ ట్యాపింగ్‌తో బెదిరించి మీరు చేసిన వసూళ్ల జాబితా వస్తుంది సిద్ధంగా ఉండు’ అని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి వెళ్లాల్సిన ఖర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పట్టలేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)