Breaking News

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి.. ఆమె స్పందన ఇదే..

Published on Fri, 09/09/2022 - 14:10

సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా తనను ఏఐసీసీ ప్రకటించడంతో పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆమె ‘సాక్షి’ మీడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ, టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, సీనియర్‌ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుంటానన్నారు. సిట్టింగ్ స్థానంలో గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు కోరుకున్నట్లుగానే అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందన్నారు. అండగా ఉన్న ప్రతీ కార్యకార్తకి ధన్యవాదాలు తెలిపిన ఆమె.. నమ్మకాన్ని నిలబెడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులే తనను మునుగోడులో గెలిపిస్తాయన్నారు.
చదవండి: రేవంత్‌ ఆ వైపు నిలిచినా.. పంతం నెగ్గించుకున్న సీనియర్లు

కాగా, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా కాంగ్రెస్‌ జనరల్‌​ సెక్రటరీ ముఖుల్‌ వాస్నిక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు టీపీసీసీ నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరిలో కాంగ్రెస్‌ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చింది. గతంలోనూ స్రవంతి అక్కడ నుంచి పోటీచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు. 
 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)