Breaking News

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం

Published on Fri, 02/20/2026 - 16:16

సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)తో సీపీఐ,సీపీఎం వంటి వామపక్షాలతో పాటు పదికిపైగా పార్టీలు పొత్తును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం (ops)..సీఎం స్టాలిన్‌తో భేటీ అ‍యారు. ఇరువురి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.

ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(aiadmk)నుంచి బహిష్కరణకు గురైన సీఎం ఓ.పన్నీరు సెల్వం శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కలిశారు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశం చివరి రోజున ఓపీఎస్‌తో పాటు ఆయన తనయుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్‌తో కలిసి స్టాలిన్‌ను కలిశారు.  

స్టాలిన్‌ గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు  
అనంతరం, డీఎంకే పాలనపై ఓపీఎస్‌ ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తోందని వ్యాఖ్యానించారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని అన్నారు. ఓపీఎస్‌ చేసిన ఈ పొలిటికల్‌ కామెంట్స్‌ తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఈ భేటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త కూటమి అవకాశాలపై ఊహాగానాలకు దారితీసింది.

ఒకప్పుడు సీఎం.. ఇప్పుడు రాజకీయ నిరుద్యోగి
ఏఐఏడీఎంకే హయాంలో ఓపీఎస్‌ సీఎంగా పనిచేశారు. ఇప్పుడు ఆ పార్టీతో విభేదాలు, ఓపీఎస్‌ అనుచరులు డీఎంకే, ఏఐఏడీఎంకేలో చేరిపోయారు. ఏఐఏడీఎంకేలో బహిష్కరణకు గురైన ఓపీఎస్‌ తిరిగి చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్‌డీఏలో తిరిగి చేరాలన్న యత్నం కూడా ఫలించలేదు. గత ఏడాది బీజేపీతో విభేదాల కారణంగా ఆయన ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఓపీఎస్‌ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. ఈ క్రమంలో స్టాలిన్‌ను ఓపీఎస్‌ కలవడం ఆసక్తికరంగా మారింది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు
అయితే,ఓపీఎస్‌,ఎంకే స్టాలిన్‌ సమావేశంపై విశ్లేషకులు భవిష్యత్తు రాజకీయాల్ని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం వల్ల ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం అన్నది విశ్లేషిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఓపీఎస్‌ను చేర్చుకోవడం ద్వారా డీఎంకే, ఏఐడీఎంకేలోని అసంతృప్తుల్ని తనవైపుకు తిప్పుకోవచ్చు. ఓపీఎస్‌కు ఉన్న వ్యక్తిగత మద్దతు, ఆయన అనుచరుల ఓటు బ్యాంక్ డీఎంకేకి చేరితే వచ్చే ఎన్నికల్లో అదనపు బలం లభిస్తుంది. ఓపీఎస్‌ను కూటమిలో చేర్చుకోవడం డీఎంకేకి వ్యూహాత్మకంగా లాభదాయకం. అదే సమయంలో డీఎంకేతో చేరితే ఓపీఎస్‌కు ఆయన కుమారుడికి రాజకీయ పునరావాసం లభిస్తుంది. ఓపీఎస్‌కు ఇది ఒక కొత్త మార్గం, కొత్త అవకాశంగా మారొచ్చు.

ఓపీఎస్‌-డీఎంకే భేటీ ప్రతిపక్ష ఏఐఏడీఎంకి పెద్ద దెబ్బ. ఇప్పటికే ఓపీఎస్‌ అనుచరులు డీఎంకే, ఏఐడీఎంకేలలో చేరిపోయారు. ఓపీఎస్‌.. డీఎంకేతో కూటమి కుదుర్చుకుంటే, ఏఐఏడీఎంలోని విభేదాలు మరింత పెరుగుతాయి. ఇది ఏఐడీఎంకే ఓటు బ్యాంక్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.

ఓపీఎస్‌.. ఎన్‌డీఏ నుంచి బయటకు రావడం బీజేపికి నష్టం. ఓపీఎస్‌.. డీఎంకేలో చేరితే, బీజేపీకి తమిళనాడులో మిత్రపక్షం కోల్పోయినట్టే. ఇది ఎన్డీయే వ్యూహానికి ప్రతికూల ప్రభావం చూపుతుంది.

మొత్తానికి సీఎం ఎంకే స్టాలిన్‌తో మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసింది. అదే సమయంలో ఏఐఏడీఎకే, బీజేపీలకు నష్టం. ఓపీఎస్‌ డీఎంకేలో చేరుతారా? లేక ఎన్డీయే కూటమితో చర్చలు జరుపుతారా? అన్న అంశంపై స్పష్టత లేదు. అయినప్పటికీ, ఈ పరిణామం రాబోయే ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)