Breaking News

సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?

Published on Sun, 03/09/2025 - 17:41

పాట్నా:  ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జేడీయూ‍ ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉంది. ‘నేను గొప్ప అంటే నేను గొప్పు’ అనే రీతిలో వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. అటు అసెంబ్లీ మొదలుకొని ఇటు మీడియా ముందు కూడా వీరి ఎక్కడా తగ్గడం లేదు.

ఈ రోజు(ఆదివారం) జరిగిన ప్రెస్ మీట్ లో సైతం  ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్..  జేడీయూ నేత, బీహార్ సీఎం  నితీష్ కుమార్ పై తనదైన శైలిలో రెచ్చిపోయారు. ‘ మీరు నితీష్ ను మీ పాలిటికల్ క్యాంప్ లోకి తీసుకునేందుకు ఏదో ఆఫర్ చేశారంట కదా’  అంటూ తేజస్వీ యాదవ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దానికి అంతే స్ట్రాంగ్ బదులిచ్చిన తేజస్వీ యాదవ్.. ‘  అదంతా నాన్సెస్. అయినా మీకు ఇటువంటి ఐడియాలు ఎవరిస్తారు. మేముందుకు ఆయన్ను ఆహ్వానిస్తాం. ఆఫర్, గీఫర్ ఏం లేదు. అటువంటి నాన్సెస్ గురించి మాట్లాడకండి.  మీ పార్టీ నుంచి ఎవరికైనా ఆఫర్ చేస్తే.. అది నేను కానీ, మా తండ్రి(లాలూ  ప్రసాద్ యాదవ్) లు మాత్రమే చేస్తాం. మేం ఎవరికీ ఎటువంటి ఆఫర్ చేయలేదు’ అని బదులిచ్చారు తేజస్వీ యాదవ్.

2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్‌ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్‌బంధన్‌ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్‌ చెప్పి మళ్లీ మహాఘట్‌బంధన్‌లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్‌ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్‌ జట్టు కట్టారు.

రెండుసార్లు సీఎంను చేశా.. అది మరిచిపోకండి

మీ నాన్నను  అడుగు.. నేనేం చేశానో?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)