Breaking News

పార్లమెంట్‌ అంతరాయాలు.. మధ్యే మార్గం ద్వారా పరిష్కారం?

Published on Thu, 08/03/2023 - 15:05

ఢిల్లీ: మణిపూర్‌ అంశంతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగటం లేదు. ఈ తరుణంలో  అంతరాయాలు లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ‘ఇండియా’ ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.  మధ్యే మార్గ పరిష్కారంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేశారు. 

అంతరాయాన్ని ఛేదించడానికి,  రాజ్యసభలో మణిపూర్‌పై చర్చ జరగడానికి ఇండియా కూటమి పార్టీలు ఆ సభా నాయకుడికి మధ్యే మార్గం పరిష్కారాన్ని అందించాయి. మోదీ ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారాయన. దీంతో ఆ ప్రతిపాదన ఏమై ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. 

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా.. సభలు పట్టుమని పూట సరిగ్గా నడిచిన దాఖలాలు లేవు. మణిపూర్‌ అంశంపై రూల్‌ నెంబర్‌ 267 ద్వారా సుదీర్ఘ చర్చకు పట్టుబడుతూ.. ప్రధాని మోదీ మణిపూర్‌ శాంతిభద్రతలపై ప్రసంగించాలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే.. కేంద్రం మాత్రం కేం‍ద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ప్రసంగిస్తారని, అదీ రూల్‌ నెంబర్‌ 176 ప్రకారం స్వల్ప కాలిక చర్చకే సిద్ధమని కరాకండిగా చెబుతోంది. దీంతో  పార్లమెంట్‌ ఉభయ సభల్లో విపక్షాల నిరసనల హోరు కొనసాగుతుంది.  అధికార పార్టీ తరపు నుంచి ఫ్లోర్‌ లీడర్లు.. విపక్ష నేతలతో చర్చలు జరుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా కూటమి ఒక అడుగు వెనక్కి వేసి మధ్యే మార్గ పరిష్కారంతో ముందుకు రావడం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)