Breaking News

సీఎం భగవంత్‌ మాన్‌ వీడియో వైరల్‌.. ప్రతిపక్షాల విమర్శలు

Published on Thu, 03/21/2024 - 19:59

లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ చేస్తున్న పనులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ నియోజవర్గంలో కల్తీ మద్యం బారినపడిన మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌..  బాలీవుడ్‌ సింగర్‌ సుఖ్విందర్‌ సింగ్‌, పాటల రచయిత బబ్బు మాన్‌తో కారులో ప్రయాణిస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 

‘రోమ్‌ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ప్లూట్  వాయించినట్ల ఉంది భగవంత్‌ మాన్‌ వ్యవహారం. ఒకవైపు కల్తీ మద్యంతో ప్రజలు మరణిస్తుంటే.. భగవంత్‌ మాన్‌ పాటలు పాడుతున్నారు’అని  పంజాబ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్‌ జాఖర్ తీవ్ర విమర్శలు చేశారు. భగవంత్‌ మాన్‌కు సంబంధించిన వీడియోను సునీల్‌ జాఖర్ తన ఎక్స్‌( ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నా శాంతి భద్రతల పరిస్థితుల విషయంపై కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌ సింగ్‌ బజ్వా మండిపడ్డారు. 

‘దిర్బా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది మంది కల్తీ మద్యం బారినపడి మరణించారు. ఈ నియోజకవర్గానికి పంజాబ్‌ ఎక్సైస్‌ మంత్రి పాతినిధ్యం వహిస్తున్నారు. దిర్బా.. సంగ్రూర్ లోక్‌సభ పరిధితో వస్తుంది. అది సీఎం భగవంత్‌ మాన్‌ సొంత జిల్లా. ఆప్‌ ప్రభుత్వం కనీసం బాధ్యత వహించపోవటం దారణం’అని ప్రతాప్‌ సింగ్‌ విమర్శలు చేశారు. ఇక.. ఇటీవల చోటు చేసుకున్న కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

చదవండి: Punjab CM: ఎ‍న్నికల వేడి.. హోటల్‌లో రోజంతా సీఎం రిలాక్స్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)