Breaking News

రాజ్య‌స‌భ చైర్మన్ ధ‌న్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం

Published on Mon, 12/09/2024 - 17:23

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూట‌మి.. రాజ్యస‌భ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధ‌న్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాలని యోచిస్తోంది. రాజ్యసభలో చైర్మ‌న్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు తరుచూ ఆరోపిస్తున్నాయి. ఆయన తమ ప్రసంగాలకు అంతరాయం కలిగిస్తున్నారని, క్లిష్టమైన అంశాలపై తగిన చర్చకు అనుమతించడం లేదని, వివాదాస్పద చర్చల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే రాజ్యంగంలోని ఆర్టికల్‌ 67(బీ) ప్రకారం జగ్‌దీప్‌ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, ఇతర భారత బ్లాక్ పార్టీల సభ్యులు ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తీర్మానంపై ఇప్పటికే ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

కాగా బిలియ‌నీర్ ఇన్వెస్ట‌ర్ జార్జ్ సోర‌స్‌తో కాంగ్రెస్ నేత‌లు లింకు పెట్టుకున్న‌ట్లు బీజేపీ నేత‌లు ఆరోపించిన నేప‌థ్యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో స‌భ‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు. స‌భాప‌క్ష నేత‌, ప్ర‌తిప‌క్ష నేతల‌తో ధ‌న్‌క‌డ్ స‌మావేశం నిర్వహించి స‌భ‌ను స‌జావుగా సాగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. ఐక్య‌త‌, సార్వ‌భౌమ‌త్వం.. దేశానికి ప‌విత్ర‌మైన‌వ‌ని, ఆ ఐక‌మ‌త్యాన్ని, సార్వ‌భౌమ‌త్వాన్ని దెబ్బ‌తీయ‌డాన్ని స‌హించ‌బోమ‌ని ధ‌న్‌క‌డ్ తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)