Breaking News

ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..

Published on Tue, 07/18/2023 - 15:39

బెంగళూరు: బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు నేడు రెండు రోజు సమావేశం ముగిసింది.  ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. భేటీలో కీలక అంశాలు ఇవే..

► 'ఎన్డీయే, బీజేపీ.. మా 'ఇండియా' కూటమిని ఛాలెంజ్‌ చేస్తారా..?' అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. 'మాతృభూమిని ప్రేమిస్తాం.. దేశాన్ని ప్రేమిస్తున్న నిజమైన దేశభక్తులం మేము. హిందువులు, దళితులు, మైనారిటీలు, రైతులు, బెంగాల్‌, మణిపూర్‌కు బీజేపీతో ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వాలను కొనడం.. అమ్మడమే వారి పని' అని బీజేపీని మమతా బెనర్జీ విమర్శించారు. 
 
► విపక్షాల భేటీ మరో సమావేశం ముంబయిలో నిర్వహించనున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

► కూటమికి నాయకుడు ఎవరనే అంశంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్‌ ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తెల్చుతారని చెప్పారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్షాల భేటీ అనంతరం ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. 

► బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్‌  (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ఐఎన్‌డిఐఏ ఉద్దేశం ఐక్యంగా పోరాడటమే అని బిహార్ సీఎం నితీష్ కుమార్‌ అన్నారు. 

► ప్రతిపక్ష భేటీలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకూటమి విజయం సాధించాక పీఎం పదవికి తమకు ఆసక్తి లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.  

► బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిపక్షాల భేటీలో మొదటి రోజు నిన్న ముగిసింది. అయితే.. ఈ మహాకూటమి తరపున ప్రధాన మంత్రి పేరును యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కన్వినర్ నితీష్ కుమార్‌ సూచించనున్నట్లు సమాచారం. 

► భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా నేడు సమావేశంలో పాల్గొననున్నారు. 

► నిన్న సమావేశంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ పక్క పక్కనే కూర్చున్నారు. దేశ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించుకున్నారు.బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడినట్లు పేర్కొన్నారు. 

► ప్రతిపక్షాల రెండో సమావేశాన్ని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. కర్ణాటకలో తిరుగులేని విజయం సాధించాక, అదే స్థలంలో దేశ రాజకీయాల్లోనూ విజయాన్ని కాంక్షిస్తూ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి: ప్రతిపక్ష భేటీ: బీజేపీకి పోటీగా మహాకూటమి పేరు ఇదే..!

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)