Breaking News

TS: ‘జేపీఎస్‌ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైంది’

Published on Tue, 05/09/2023 - 15:18

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు వెంటనే విధుల్లో చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తప్పిస్తామని ప్రభుత్వం వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో, వారికి మంగళవారం సాయంత్రం 5గంటలలోపు విధుల్లోకి చేరాలని గడువు ఇచ్చింది. 

ఈ క్రమంలో జూనియర్‌ సెక్రటరీలకు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. తాజాగా జేపీఎస్‌ల సమ్మెకు కరీంనగర్‌లో హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ‘డిమాండ్‌ సాధన కోసం సమ్మె చేస్తే నోటీసులివ్వడం దుర్మార్గం. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్‌ వేతనాలు ఎందుకు పెంచడం లేదు. వెంటనే జేపీఎస్‌ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి’ అని సీరియస్‌ అయ్యారు. 

మరోవైపు, జేపీఎస్‌ల సమ్మెపై టీపీసీసీ రేవంత్‌ రెడ్డి కూడా స్పందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్‌ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జేపీఎస్‌ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. జేపీఎస్‌లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 

ఇది కూడా చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)