Breaking News

'ఇండియా' కూటమి తొలి భేటీ రేపే.. కేంద్రాన్ని ఇరుకున పెట్టడంపైనే చర్చ..

Published on Wed, 07/19/2023 - 19:47

ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. అటు 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరు భేటీతో ఏకమయ్యాయి. అయితే.. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష కూటమి 'ఇండియా' ఏకతాటిపై నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఇందుకు తొలిసారిగా 'ఇండియా' కూటమి తొలిసారిగా రేపు సమావేశం కానుంది. ఈ మేరకు రాజ్యసభలోని విపక్షాల ఛాంబర్‌లో భేటీ జరగనుందని సమాచారం. 

వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై సందించాల్సిన ప్రశ్నల గురించి చర్చించనున్నారని ఓ విపక్ష పార్టీ నేత తెలిపారు. అయితే.. బెంగళూరులో మంగళవారం 26 విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిపై పోరుకు సిద్ధమయ్యాయి. విపక్ష కూటమికి 'ఇండియా' అనే పేరును కూడా సూచించారు.

గురువారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నీపార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఉన్న ప్రధాన సమస్యలను ఒకే గొంతుకగా వినిపించనున్నారు. అటు.. వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంట్‌లో నేడు అఖిలపక్షాల భేటీని కేంద్రం నిర్వహించింది. సమావేశాలకు అన్ని పార్టీలు సహకరించాలని కోరింది. మణిపూర్ హింస, ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించనున్నాాయి విపక్షాలు.

ఇదీ చదవండి: డిప్యూటీ స్పీకర్‌పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)