Breaking News

'భయపడేవాడు కాదు మోదీ..' ప్రతిపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు..

Published on Fri, 07/07/2023 - 17:12

రాయ్‌పుర్‌: ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అవినీతిలో కూరుకుపోయినవారు ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకరికొకరు తిట్టుకున్నవారు నేడు కలుసుకోవడానికి సాకులు వెతుకుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు రాయ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. 

'మోదీ భయపడడు..'
అవినీతి కోసం హామీలను కాంగ్రెస్ ఇస్తే.. అవినీతిని అంతం చేసే హామీని మోదీ ఇస్తున్నాడని చెప్పారు. అవినీతి లేకుండా కాంగ్రెస్ శ్వాసించలేదంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ భావాజాలంలోనే అవినీతి ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్‌ అడ్డుగోడగా నిలబడిందని అన్నారు. 

అవినీతిపరులు ప్రతిపక్ష కూటమి పేరుతో తనపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరంతరం తననే అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. తనను ఓడించడం కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ భయపడేవారు ఎప్పటికీ మోడీ కాలేడంటూ ప్రతిపక్షాలపై ప్రధాని విరుచుకుపడ్డారు. కాగా.. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. 

రూ.7 వేల కోట్ల వ‍్యయంతో..
రాయ్‌పుర్‌లో ప్రధాని సభకు హాజరయ్యేందుకు వస్తుండగా ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి సరైన చికిత్స అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పారు. ఈ సభ ముందురోజు ఛత్తీస్‌గఢ్‌లో రూ.7 వేల కోట్ల వ‍్యయంతో ఎనిమిది ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ కార్యక్రమం చేశారు. ఇందులో 6,400 కోట్లతో ఐదు జాతీయ రహదారులు నిర్మించనున్నారు. 

ఇదీ చదవండి: తీవ్ర పదజాలంతో ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు! కానీ..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)