Breaking News

నాడు తండ్రి బహిష్కరణ.. నేడు కొడుక్కి ఘన స్వాగతం!

Published on Fri, 03/08/2024 - 16:40

ఒడిశా రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత,  24 సంవత్సరాల క్రితం బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన బిజోయ్ మహపాత్ర కుమారుడు అరబింద మహపాత్ర అదే బీజేడీలో చేరారు. ఆయన్ను బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీలోకి స్వాగతించారు.

సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో అరబింద మహాపాత్ర పార్టీలో చేరారు. అరబిందను ఆత్మీయంగా పార్టీలోకిక ఆహ్వానించిన నవీన్‌ పట్నాయక్.. కేంద్రంపద జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. "మేము మిమ్మల్ని బీజేడీలోకి స్వాగతిస్తున్నాము. కేంద్రపద జిల్లా కోసం కష్టపడి పని చేయండి. మీకు నా ఆశీస్సులు ఉన్నాయి. అలాగే మీ తండ్రికి కూడా ధన్యవాదాలు" అని పట్నాయక్ అన్నారు. 

ఒడిశాలో అధికార  బిజూ జనతాదళ్‌,  బీజేపీ ఇటీవల విడివిడిగా సమావేశాలు నిర్వహించిన  రెండు పార్టీల సీనియర్‌ నేతలతో పొత్తు ఖరారు చేసుకునే దశలో ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 1980 నుంచి 2000 మధ్య కాలంలో పట్కురా నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బిజోయ్, ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి, మాజీ సీఎం బిజూ పట్నాయక్‌కు నమ్మకస్తుడిగా పేరుగాంచారు. 

1997 ఏప్రిల్ 17న బిజూ పట్నాయక్ మరణించిన తర్వాత బీజేడీ ఏర్పాటులో, బిజూ చిన్న కుమారుడు నవీన్ పట్నాయక్‌ నాయకత్వం వహించడంలో బిజోయ్ కీలకపాత్ర పోషించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా ఆయన నాయకత్వం వహించారు. అయితే ఆ తర్వాత నవీన్‌ పట్నాయక్ చాలా నిర్ణయాలను బిజోయ్‌ వ్యతిరేకించారు. ఇదే బీజేడీ నుంచి నిష్క్రమించడానికి కారణమని చాలా మంది నమ్ముతారు. తరువాత 2001లో బిజోయ్‌ ఒడిషా గణ పరిషత్‌ను స్థాపించారు. అది తరువాత ఎన్‌సీపీలో విలీనమైంది. ఆ తర్వాత బిజోయ్ మహపాత్ర బీజేపీలో చేరారు. 

ఒడిశాలో 21 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీకి అత్యధిక సీట్లు వచ్చాయి. బీజేడీ 12, బీజేపీ 8, కాంగ్రెస్‌ ఒక సీటు గెలుచుకున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)