Breaking News

డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా.. ఫ‌డ్న‌వీస్ యూట‌ర్న్‌

Published on Sat, 06/08/2024 - 16:48

ముంబై: మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఇటీవ‌ల దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌హరాష్ట్ర‌లో బీజేపీ కూట‌మికి త‌క్కువ సీట్లు రావ‌డంపై నైతిక బాధ్య‌త వ‌హిస్తూ  డిప్యూటీ సీఎంగా వైదొలగాలని ఫడ్నవీస్ నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా త‌న నిర్ణ‌యంపై ఫ‌డ్న‌వీస్ యూట‌ర్న్ తీసుకున్నారు.

రాజీనామా విష‌యంలో త‌న ఆలోచ‌న మార్చుకున్న‌ట్లు చెప్పారు. పారిపోయే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెప్పారు. అయితే ఫ‌డ్న‌వీస్ రాజీనామా విష‌యం తెలుసుకున్న అమిత్ షా..  మహారాష్ట్ర ప్రభుత్వంతో క‌లిసి కొన‌సాగాల‌ని కోరిన మ‌రుస‌టి రోజే ఫ‌డ్న‌వీస్ నుంచి తాజా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

ఈ మేర‌కు ఆయ‌న మాట్లాడుతూ.. అంద‌రి ముఖాల్లో సంత‌క్ష‌షం క‌నిపిస్తుంద‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేరు మార్పోగుతోంద‌న్నారు. మూడో సారి ప్ర‌ధానిగా ఎన్డీయే మోదీ పేరును ఏక‌గ్రీవంగా అంగీక‌రించింద‌ని తెలిపారు. ఈసారి మ‌హారాష్ట్ర‌లో తాము ఆశించిన సీట్లు గెలుచుకోలేక‌పోయిన‌ట్లు చెప్పారు.  కానీ నేటి స‌మావేశంతో భ‌విష్య‌త్తు వ్యూహాన్ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ..  లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీకి నేనే నాయకత్వం వహించాను, కాబట్టి ఈ ఓటమికి నేనే కారణమని భావిస్తున్నాను. అందుకే న‌న్ను ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని కోరాను.  దీనివ‌ల్ల త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే  మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం క్షేత్ర స్థాయి నుంచి పని చేయొచ్చు. కానీ కొందరు నాపై విశ్వాసం చూపించారు. ఫ‌లితాల‌తో నేను నిరాశ చెందాను అని కొందరు అనుకున్నారు, కానీ నేను పారిపోను. మా స్ఫూర్తి ఛత్రపతి శివాజీ. నేను ఎలాంటి భావోద్వేగ నిర్ణయం తీసుకోలేదు, నా దృష్టిలో వ్యూహం ఉంది.

కాగా శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో ఫడ్నవిస్ సమావేశమయ్యారు. అక్టోబరులో జరిగే అవకాశం ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించి,  పార్టీ గెలుపు కోసం ప‌నిచేయాల‌నిి ఫడ్నవీస్‌ను షా కోరినట్లు తెలిసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)