‘అమ్మ చనిపోయింది.. ఆఖరి చూపులకూ వెళ్లలేకపోయా’

Published on Fri, 04/12/2024 - 09:32

ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన 'ఎమర్జెన్సీ' రోజులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. తనను 18 నెలల పాటు జైలులో పెట్టిన నాటి ప్రభుత్వం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా పెరోల్‌ ఇవ్వలేదన్నారు. బీజేపీపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన 'నియంతృత్వ' ఆరోపణలపై స్పందింస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

వార్తా సంస్థ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. "ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు పెరోల్ ఇవ్వలేదు. ఇప్పుడు వారు ( కాంగ్రెస్ ) మమ్మల్ని నియంతలు అంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. 

ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్‌నాథ్ సింగ్ వయస్సు 24 సంవత్సరాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977 మార్చి వరకు కొనసాగిన జేపీ ఉద్యమంలో మిర్జాపూర్-సోన్‌భద్రకు ఆయన కన్వీనర్‌గా పనిచేశారు. "అప్పుడు నాకు కొత్తగా పెళ్లైంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన నన్ను అర్ధరాత్రి సమయంలో  పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. ఏకాంత నిర్బంధంలో ఉంచారు" అని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

ఒక సంవత్సరం జైలులో గడిపిన తరువాత, ఆయన్ను విడుదల చేస్తారా అని అడిగిన రాజ్‌నాథ్ సింగ్ తల్లికి ఎమర్జెన్సీని మరో సంవత్సరం పొడిగించారని బంధువు ఆమెకు తెలియజేశారు. ఆ దిగులుతో ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి 27 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. తనకు పెరోల్ రాకపోవడంతో తల్లి అంత్య క్రియలకు వెళ్లలేకపోయానని, దీంతో తన సోదరులే అంత్యక్రియలు నిర్వహించారని వివరించారు. తాను జైలులోనే గుండు గీయించుకున్నానని తెలిపారు.

Videos

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

Magazine Story About ChandraBabu Cunning Plans

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)