Breaking News

ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం..జరిగేది ఇదే..!

Published on Tue, 12/10/2024 - 14:54

సాక్షి,ఢిల్లీ: ఉపరాష్ట్రపతి,రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానంపై దాదాపు 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానానం అంశంలో కాంగ్రెస్‌ లీడ్‌ తీసుకుంటోంది. కాంగ్రెస్‌ సభ్యులతో చైర్మన్‌ రాజ్యసభలో వ్యవహరిస్తున్న తీరు వల్లే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెబుతున్నారు.

అధికార బీజేపీ సభ్యులకు చైర్మన్‌ కావాలనే కాంగ్రెస్‌-సోరోస్‌ లింకులపై నినాదాలు చేయడానికి అవకాశాలు ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అయితే తీర్మానం ఆమోదం పొంది ఉపరాష్ట్రపతి దన్‌ఖడ్‌ను తొలగించాలంటే పార్లమెంట్‌ ఉభయసభల్లో అవిశ్వాస తీర్మానం మెజారిటీ ఓట్లతో నెగ్గాల్సి ఉంటుంది. 

అధికార ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమికి పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ మెజారిటీ లేకపోవడంతో ఈ తీర్మానం నెగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే తమ తీర్మానంతో ఇండియా  కూటమి సభ్యులంతా మళ్లీ ఒక్కటై రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం అంశంలో విజయం సాధిస్తామని  విపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా,  ప్రొసీజర్‌ ప్రకారం అవిశ్వాస తీర్మానం ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే ఈ పార్లమెంట్‌ సెషన్‌ డిసెంబర్‌ 20తో ముగుస్తుండడంతో తీర్మానం అసలు సభలోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. కేవలం చైర్మన్‌ తీరును దేశ ప్రజల ముందు ఎండగట్టాలనే వ్యూహంతోనే ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందన్న మరో వాదనా వినిపిస్తోంది.

ఒకవేళ రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. తర్వాత ఏం జరుగుతుంది..?

చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఒకవేళ రాజ్యసభలో ప్రవేశ పెట్టారనే కాసేపు అనుకుందాం. ఇక్కడ తీర్మానం సింపుల్‌ మెజారిటీతో ఆమోదం పొందాలి. అప్పుడే తీర్మానం లోక్‌సభకు వెళుతుంది. అక్కడికీ వెళ్లిందనుకుందాం.. తీర్మానం.. అక్కడా సింపుల్‌ మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇంత జరిగితేనే ధన్‌ఖడ్‌ పదవిని కోల్పోతారు. 

నిజానికి నోటీసు ఇచ్చినప్పటి నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలంటే 14 రోజుల టైమ్‌ రాజ్యాంగ నిబంధన. ఇక్కడ ఆ నిబంధనను ఇండియా కూటమి పాటించలేదు. సెషన్‌ మరో 10 రోజులుందనగా నోటీసు ఇచ్చింది. దీంతో తీర్మానం అసలు రాజ్యసభకే వెళ్లదని తెలుస్తోంది. ఒక వేళ వెళ్లినా ఏ సభలోనూ ఇండియా కూటమికి సింపుల్‌ మెజారిటీ లేదనే విషయం తెలిసిందే. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)