Breaking News

బీజేపీకి షాక్‌.. కూటమికి సీఎం నితీష్‌ కుమార్‌ గుడ్‌బై.. ఎక్కడంటే?

Published on Wed, 01/22/2025 - 16:41

ఇంఫాల్‌ : బీహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ (cm nitish kumar) బీజేపీకి ఝలక్‌ ఇచ్చారు. మణిపూర్‌ (manipur) బీజేపీ (bjp) నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జనతా దళ్‌ (యునైటెడ్‌) తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 

ఈ మేరకు జేడీయూ యూనిట్‌ అధినేత కాష్ బీరెన్ సింగ్  రాష్ట్ర అధికార బీజేపీకి మద్దతు ఉప సంహరించుకుంటున్నట్లు మణిపూర్‌ గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ బహ్లాకు లేఖ రాశారు. ప్రతిపక్ష బాధ్యత వహిస్తారని సూచించారు.

మణిపూర్‌లో తమపార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే  ఎండీ అబ్దుల్‌ నసీర్‌కు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో సీటును కేటాయించాలని కోరారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీకి జేడీయూ మద్దతు ఉండబోదని, అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని లేఖలో పేర్కొన్నారు. గతంలో బీజేపీకి  కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. తాజాగా, జేడీయూ సైతం కమలానికి గుడ్‌ బై చెప్పడం మణిపూర్‌ రాష్ట్ర రాజకీయాలు చర్చాంశనీయంగా మారాయి.  

2022 మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదురుగు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.  60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు.  

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్‌లో అభివృద్ది ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టి పారేస్తున్నారు. కేంద్ర ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాదు కూడదు అంటే .. అది బీజేపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు.  

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)