Breaking News

విపక్షాల కూటమికి నాయకుడు ఎవరు..? తేల్చేది ఎవరు..? పెదవి విప్పిన ఖర్గే..

Published on Tue, 07/18/2023 - 18:11

బెంగళూరు: బెంగళూరు వేదికగా నిర్వహించిన విపక్షాల సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు. కూటమి పేరుతో సహా.. పలు రాష్ట్రాల్లో పార్టీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్షాల భేటీ అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు. 

కూటమికి సంబంధించి ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశాలను చర్చించడానికి ముంబయి వేదికగా మరోసారి విపక్ష పార్టీలు సమావేశమవుతాయని ఖర్గే చెప్పారు. కూటమికి నాయకుడు ఎవరనే అంశాన్ని తేల్చే వ్యవహారంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్‌.. ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తేల్చుతారని చెప్పారు. ఇవి చాలా చిన్న విషయాలని ఆయన అన్నారు. 

నేడు బెంగళూరులో జరిగిన భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు. 

బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్‌  (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. 

ఇదీ చదవండి: Opposition Meeting Live Updates: ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)