Breaking News

‘రాఘవ్‌ చద్దా ఎక్కడ?’.. పోస్ట్‌ డిలీట్‌ చేసిన ఎన్సీపీ నేత

Published on Sun, 03/31/2024 - 12:13

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉ‍న్నారు. ఆయన అరెస్ట్‌ను ఆప్‌ మంత్రులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా ఇకప్పటికీ స్పందించకపోవటంపై ఎన్సీపీ (శరద్‌ పవార్‌) నేత జితేంద్ర అవధ్‌  ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాల కూటమిలో భాగంగా.. ఎన్సీపీ, ఆప్‌ భాగస్వామ్య పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై ఎంపీ రఘవ్‌ చద్దా స్పందించలేదని ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ‘రఘవ్‌ చద్దా ఎక్కడ?’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టిన ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్‌ తర్వాత  దాన్ని డిలీట్‌ చేయటం గమనార్హం.

శనివారం జితేంద్ర అవధ్‌ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అయిన దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ రఘవ్‌ చద్దా కనిపించటం లేదు. ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కానీ, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎంపీ రాఘవ్‌ చద్దా మాత్రం కనిపించటం లేదు. ఆప్‌కు రాఘవ్‌ చద్దా కీలకమైన నేత.. ఆయన ఇక్కడ లేకపోవటం, అరెస్ట్‌పై స్పందించకపోవటం కార్యకర్తలను అవనించినట్లే’ అని  జితేంద్ర అన్నారు.  దూరంగా వేరే దేశంలో ఉ‍న్నంత మాత్రనా ప్రజలతో కనెక్ట్‌కాలేని రోజుల కాలం కాదు. ఆయన లండన్‌లో ఉన్పటికీ కనీసం స్పందిచకపోవటం చాలా విచిత్రం. ఒక వీడియో సందేశమైనా పార్టీకి, కార్యకర్తలకు పంపాలి. రఘవ్‌ చద్దా పూర్తిగా కనిపించకుండా, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నా’ అని ఎనన్సీపీ నేత జితేంద్ర అవధ్‌ అన్నారు.

ఇక.. రఘవ్‌ చద్దా, ఆయన భార్య పరిణితి చోప్రాతో కలిసి లండన్‌ వెళ్లారు. కంటికి సంబంధించిన చికిత్స కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుసస్తోంది. ఢల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏప్రిల్‌ 1తో ఈడీ కస్టడీ ముగియనుంది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)