Breaking News

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ల మధ్య కుదిరిన పొత్తు

Published on Mon, 08/26/2024 - 21:18

శ్రీనగర్‌ : అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్‌లో పొత్తు పొడిచింది.‌ జమ్మూ కశ్మీర్‌లో జరగనున్న 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

ఈ తరుణంలో పొత్తుపై ఇరు పార్టీల నేతలు స్పందించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 51 స్థానాల్లో, కాంగ్రెస్‌ 32 స్థానాల్లో పోటీ చేయనుందని తెలుస్తోంది. 

ఈ పొత్తు సంతోషకరం. ఇక్కడ ప్రజలను విభజించి పాలించాలని ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా మేం ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తాం. కశ్మీర్‌లో ఇండియా కూటమి దేశాన్ని మతతత్వం, విభజించడం, విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులతో పోరాడుతుంది’ అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు.  

ఇక కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల మధ్య పొత్తు కుదిరినా.. సీట్ల పంపకాల విషయంలో విబేధాలు తలెత్తాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ట్రబుల్‌ షూటర్లుగా కేసీ వేణుగోపాల్‌,సల్మాన్‌ ఖుర్షీద్‌లను శ్రీనగర్‌కు పంపింది. కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు సీనియర్ల రాక, ఆపై మంతనాలు.. వెరసి తొలి విడత ఎన్నికల నామిషన్ల దాఖలు ప్రక్రియకు ఒక రోజు ముందే పొత్తు కుదిరిందని కేసీ వేణుగోపాల్‌ చెప్పారు.

ఇరు పార్టీల మధ్య చర్చలు పూర్తయియ్యాయి. ఈ ఎన్నికల్లో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాం. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తాం’ అని వేణుగోపాల్‌ ధీమా వ్యక్తం చేశారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)