Breaking News

ప్రధానమంత్రి పదవి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు

Published on Sun, 11/03/2024 - 06:33

న్యూఢిల్లీ: దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోదీ పదేపదే డొల్ల హామీలు ఇస్తూ ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ గురించి ఆందోళనను పక్కనపెట్టి, ప్రధాని పదవి గౌరవాన్ని పెంచడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని మోదీకి హితవు పలికారు. ఈ మేరకు ప్రియాంక శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సత్యమే దేవుడు, సత్యమేవ జయతే అని జాతిపిత మహాత్మాగాంధీ తరచుగా బోధిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. 

వేలాది సంవత్సరాల మన సంస్కృతికి సత్యమే ఆధారమని ఉద్ఘాటించారు. ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడం, డొల్ల హామీలు ఇవ్వడం సరైందని కాదని స్పష్టంచేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాయన్ని వెల్లడించారు. గ్యారంటీలతో ప్రజల సొమ్మును ప్రజలకు అందజేస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ఎన్నో హామిలిచ్చారని, వాటిలో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. మోదీ హామీలన్నీ బూటకమేనని తేలిపోయిందన్నారు. ‘అచ్చే దిన్‌’ ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)