టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే 

Published on Fri, 04/19/2024 - 05:53

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకుని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తోందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ నాగుల్‌మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్‌ పెట్టిన బీజేపీ దానిని.. ముస్లిం సమాజంపైకి గురిపెట్టిందన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికే ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జత కట్టడం ముస్లి సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌) చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరీయ చట్టాన్ని కనుమరుగు చేస్తారన్నారు.

దీని వల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక కీలక అంశాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింల­కు వైఎస్సార్‌ ఇచి్చన 4 శాతం(బీసీ–ఈ)రిజర్వేషన్‌ను పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారని, అదే జరిగితే ఏపీలోనూ ముస్లింల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ముస్లిం సంప్రదాయమైన హిజాబి(బుర్ఖా)ను పూర్తిగా నిషేధిస్తారని చెప్పారు.

వక్ఫ్‌ చట్టాన్ని రద్దు చేసి ముస్లింల అభ్యున్నతి కోసం ఉన్న వక్ఫ్‌ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ప్రధాన అజెండాలో టీడీపీ పాలుపంచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ–టీడీపీ కూట­మి అధికారంలోకొస్తే ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెరుగుతాయన్నారు. సీఎం జగన్‌ అన్ని విధాలా ముస్లింలను ఆదరించారని   చెప్పారు.  ఉపముఖ్యమంత్రి, మండలి డిప్యూటీ చైర్మన్, ముగ్గురికి ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం ఇవ్వడంతో పాటు ఎంతోమందికి స్థానిక ప్రభుత్వాల్లో అవకాశం కల్పించార­న్నారు. జగన్‌తోనే ముస్లిం సమాజానికి భద్రత, మేలు ఉంటాయని నాగుల్‌ మీరా స్పష్టం చేశారు.

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)