Breaking News

ప్రతిపక్షాలు కూడా సీఎం జగన్‌ను అభినందించాల్సిందే: ఆర్‌.కృష్ణయ్య

Published on Wed, 06/14/2023 - 14:50

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తో​ంది. సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌. కృష్ణయ్య.

కాగా, కృష్ణయ్య బుధవారం బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్‌ పోస్టుల్లో తొలిసారి బీసీలకు న్యాయం జరిగింది. రోడ్లమీద కాదు పార్లమెంట్‌లో బీసీల కోసం పోరాడండి అని సీఎం జగన్ చెప్పారు. అందుకే నన్ను పార్లమెంట్‌కు పంపించారు. 50 శాతం బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో నన్ను పోరాడమని చెప్పారు.  సామాజిక న్యాయం చేయడానికి దమ్ముకావాలి. బీసీల అభ్యున్నతికి  పాటుపడుతున్న సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలి. 

దేశంలో ఏ రాష్ట్రంలోనూ సీఎం జగన్‌ మాదిరి బీసీలకు మంత్రి పదవులివ్వలేదు. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతిపక్షాలు అభినందించాలి. అమ్మఒడి వంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. ప్రతీ పథకంలోనూ బీసీలకు ఎంతో మేలు జరుగుతోంది. మనకు సీఎం జగన్‌ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏపీలో 60% పదవులు బీసీలకు దక్కడం మనకు గర్వకారణం.  గతంలో ఎవరైనా బీసీలకు మేలు చేశారా?. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని చెప్పే దమ్మున్న వ్యక్తి సీఎం జగన్ తప్ప మరెవరైనా ఉన్నారా?. మనకు రాజ్యాధికారం కల్పించిన ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి:  అమిత్‌షాకు మంత్రి బొత్స కౌంటర్‌

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు