Breaking News

నిజాం షుగర్సే ప్రధాన ప్రచారాస్త్రం

Published on Fri, 10/13/2023 - 04:18

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పసుపు బోర్డు అంశం తరహాలోనే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీల అంశం ఉత్తర తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారా స్త్రం కానుంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇందూరు కు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్‌ పేపర్‌ రాసి చ్చిన ధర్మపురి అర్వింద్‌ అనూహ్యంగా విజయం సాధించారు. ఈనెల 3న ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి పసుపు బోర్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీకి ఆదరణ పెరిగింది.

ఇదే తరహాలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను తెరి పించడం, చెరుకు పంట విస్తీర్ణాన్ని పెంచడమనే అంశాన్ని ఎజెండాగా తీసుకుని మరొక బాండ్‌ రాసి చ్చేందుకు అర్వింద్‌ రంగం సిద్ధంచేస్తున్నారు. ని జాం షుగర్‌ ఫ్యాక్టరీలు ఉమ్మడి నిజామాబాద్‌ (బో ధన్‌), ఉమ్మడి కరీంనగర్‌ (జగిత్యాల జిల్లా ముత్యంపేట), ఉమ్మడి మెదక్‌ (ముంబోజిపల్లి) జిల్లాల్లో ఉన్నాయి. దీంతో బీజేపీ ఎంపీ అర్వింద్‌ పార్టీ అధినాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లా డి తగిన కార్యాచరణ సిద్ధం చే స్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని చెరుకు పాలసీని స్టడీ చేస్తున్నారు.

యూపీలో మాదిరిగా చెరుకు పంట సాగుతో పాటు దాన్ని రెగ్యులేట్‌ చేసేందుకు షు గర్, బ్రౌన్‌ షుగర్, ఇథనాల్‌ అనే మూడు ఉత్పత్తుల తయారీకి ప్లాన్‌ చేస్తున్నారు. చెరుకుకు మద్దతు ధర ఇస్తున్న నేపథ్యంలో పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదక ఖర్చు 30 శాతం ఎక్కువ ఉంటోంది. దీంతో షుగర్‌ ఎగుమతులు అంతగా చేయలేని పరిస్థితి. దీంతో ఇథనాల్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో చెరుకు సాగు విస్తీర్ణాన్ని ప్రోత్సహించేందుకు ఎంపీ అర్వింద్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుని పార్టీ నాయకత్వంతో ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌ తెరిపిస్తామని హామీ ఇస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు మాత్రం కేసీఆర్‌ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు