Breaking News

అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం..

Published on Thu, 08/24/2023 - 09:25

సాక్షి, యాదాద్రి: మాజీ మంత్రి,సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ తొలి జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయాలనుకున్న మోత్కుపల్లికి అవకాశం దక్కకపోవడంతో భవిష్యత్‌ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. గురువారం యాదగిరిగుట్టలో తన అనుచరులతో సమావేశం అవుతున్నారు.

అవమానంగా భావించి
దళితబంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్‌ మోత్కుపల్లి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆరు నెలలుగా కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నారు. టికెట్లు ప్రకటించే సమయంలోనైనా సిట్టింగులకే ఇ స్తున్నామని మాట వరుసకైనా చెప్పలేదన్న ఆవేదన ఆయనలో ఉందని అనుచరులు చెబుతున్నారు. 

కాగా ఇప్పటికే  నకిరేకల్‌ టికెట్‌ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్‌ఎస్‌ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
చదవండి: అసంతృప్తులకు గాలం 

నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు:
వైరా:
‘నేను నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు. నాకు టికెట్‌ రాకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు బరువెక్కిన హృదయంతో ఉన్నారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్‌ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా’అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ అన్నారు. బుధవారం ఆయన వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, అయితే వృద్ధాప్యంలో ఉన్నందున వద్దన్నానని తెలిపారు.

తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, అందరితో కలిసి పని చేస్తానని, వైరా టికెట్‌ కేటాయించిన మదన్‌లాల్‌ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్‌ భగవంతుడి కంటే ఎక్కువని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని చెప్పారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందంటూ కేసీఆర్‌ ఆశీర్వాదం ఎప్పటికైనా తనకు లభిస్తుందని దీమా వ్యక్తం చేశారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)