Breaking News

ఒకే సీటుపై మూడు సార్లు పోటీకి దిగిన మూడో ప్రధానిగా మోదీ!

Published on Wed, 05/15/2024 - 07:13

యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ తొలి ప్రధాని  నెహ్రూ, వాజ్‌పేయిల రికార్డును సమం చేశారు. ఈ మాజీ దివంగత ప్రధానులిద్దరూ ఒకే లోక్‌సభ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఓట్లతో విజయం సాధించారు. ఇప్పుడు మోదీ కూడా ఒకే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.

పండిట్ నెహ్రూ 1951, 1957, 1962లో మూడుసార్లు ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఫుల్‌పూర్ సీటుకు ఎంపీగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా దేశ పగ్గాలను చేపట్టారు. భారతరత్న పండిట్ అటల్ బిహారీ వాజ్‌పేయి లక్నో నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్నప్పటికీ, 1996, 1998, 1999లో ఎంపీ అయిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టారు. తాజాగా నరేంద్ర మోదీ 2014, 2019లో వారణాసి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఆయన నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా, ఒకే లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత దక్కించుకున్నారు.

భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 14 మంది ప్రధానులు దేశాన్ని పాలించారు. వారిలో తొమ్మిది మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నరేంద్ర మోదీ వరకూ వచ్చింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి యూపీలోని వివిధ స్థానాల నుండి ఎన్నికలలో గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు.

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)