Breaking News

రంజుగా మారిన రాజకీయం.. ప్రధాని మోదీకి ఎంఎన్‌ఎస్ భేషరతుగా మద్దతు

Published on Tue, 04/09/2024 - 21:00

లోక్‌సభ ఎన్నికల తరుణంలో మహరాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. 

గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎంఎన్ఎస్ నేత రాజ్‌ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రాజ్‌ థాకరే బీజేపీ, ఏక్‌నాథ్ షిండే - శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పక్షాల కూటమి ‘మహాయుతి’లో చేరవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఈ తరుణంలో ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌థాకరే కీలక ప్రకటన చేశారు. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద గుడిపడ్వా వేడుకల్లో పాల్గొన్న రాజ్‌ థాకరే ప్రసంగిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎస్‌ పోటీ చేయదని తెలిపారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మద్దతు కోరారు.

నాకు పదవులొద్దు
నాకు రాజ్యసభ, విధానసభ పదవులు వద్దని ఫడ్నవీస్‌తో చెప్పాను. అంతేకాదు నేను ఎటువంటి అంచనాలు, షరతులు లేకుండా ప్రధాని మోదీతో పాటు మహాయుతి కూటమికి మద్దతిస్తున్నానని రాజ్‌ థాకరే అన్నారు. కాగా, ఎంఎన్‌ఎస్‌ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)