Breaking News

వ్యక్తిగత విషయాలపై ఇంత విషమా..!

Published on Wed, 10/18/2023 - 03:48

జగిత్యాలటౌన్‌: ‘తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. ఆడబిడ్డనైన నన్ను నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అన్న మాటలు మీ ఆడబిడ్డలను అంటే మీకు సమ్మతమేనా..? నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి నన్ను ఏమన్నా ఒప్పుకుందా మా..? తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను అనుమతిద్దామా..? ’అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో ప్రశ్నించారు. ఈ మేరకు కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్‌లో తాను ఓడిపోయాక, గెలిచిన వారికి పనిచేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నానని, గెలిచిన వ్యక్తి బాధ్యతలు విస్మరించి ఇష్టమొచ్చినట్లు వ్యక్తి గతంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘నువ్వు చచ్చిపోతే 20 లక్షలు ఇస్తా.. మీ అన్న చచ్చిపోతే పది లక్షలిస్తా.. మీ నాన్న ఇట్లా..’ అంటూ అర్వింద్‌ మాట్లాడటం.. ఇటువంటి భాషను ప్రయోగించడం ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించాలని కవిత విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రాపాలకులపై మన నేతలు ఇలా అమర్యా దగా మాట్లాడలేదని గుర్తుచేశా రు. అలాంటి మర్యాదకరమైన రాజకీయాలు ఇప్పుడూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కక్షలకు తెలంగాణలో తావులేదని స్పష్టం చేశారు. ఇలా అడ్డగోలుగా మాట్లాడేవాళ్లు ఉంటారనే అడబిడ్డలను ఉద్యోగాలకు పంపించడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి ఉందన్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చే ఆడబిడ్డలకు ఏం సందేశం ఇస్తున్నట్లని ప్రశ్నించారు.   

#

Tags : 1

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)