Breaking News

సీతారాం ఏచూరిని కలిసిన ఎమ్మెల్సీ కవిత

Published on Thu, 03/09/2023 - 21:26

సాక్షి, ఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో గురువారం కలిశారు. ఆయనను జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షకు ఆహ్వానించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, దేశంలో పరిస్థితులు, మహిళా రిజర్వేషన్ బిల్లు రావాల్సిన ఆవశ్యకతపై చర్చించామన్నారు. ఎస్పీ, ఆర్జేడీ పార్టీలకు ప్రాథమికంగా మహిళ రిజర్వేషన్లపై ఎలాంటి అభ్యంతరం లేదని  కవిత అన్నారు.

‘‘మజ్లిస్ పార్టీని కూడా ధర్నాకు ఆహ్వానించాం. బిల్లు పెడితే అన్ని అంశాలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 18 పార్టీలకు చెందిన నేతల ప్రతినిధులు రేపు హాజరుకానున్నారు. కాలేజీలు, యూనివర్సిటీలో బిల్లు ప్రాముఖ్యత వివరిస్తాము. మహిళా బిల్లు వల్ల ఎవరికీ నష్టం లేదు. బిల్లు పెట్టే బీజేపీ చిత్తశుద్ధి నెరవేర్చుకోవాలి. బీజేపీ హైదరాబాద్ దీక్ష చేపడుతుందంటే.. ఢిల్లీలో నా దీక్ష సక్సెస్ అయ్యనట్టే కదా.. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేలా బండి సంజయ్, కిషన్ రెడ్డి చూడాలి’’ అని కవిత అన్నారు.

‘‘మార్చి 2న నేను దీక్ష చేస్తామని ప్రకటించాను. నాకు ధైర్యం ఉంది. 9 వతేదీన రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.. నేను 11ను  వస్తాను అని తెలియజేశాను. బీఎల్‌ సంతోష్‌ ఎందుకు సిట్ ఎదుటకు రారు. కోర్టు స్టేలు తెచ్చుకున్న వ్యక్తులు మాట్లాడితే ఎలా?. ఈడీ ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తా. వెళ్లాల్సిన సమయంలో కోర్టుకు వెళ్తాం’’ అని కవిత పేర్కొన్నారు.
చదవండి: ఈడీ విచారణకు కవిత.. అరెస్ట్‌ తప్పదా?.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి ఏంటి?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)