MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి
Breaking News
‘అంత భయమెందుకు.. బండి సంజయ్ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు?’
Published on Wed, 11/23/2022 - 15:31
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ఈడీ, ఐటీ, సిట్ హీట్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో పొలిటికల్ లీడర్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, నాగిరెడ్డిపేట్ మండలం తాండూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈడీ, ఐటీకి భయపడే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వాళ్లే భయపడతారు. బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు రావడంలేదు. మేము విచారణకు హాజరు కావాలి కానీ.. బీజేపీ వాళ్లు విచారణకు రారా?. బీఎల్ సంతోష్‌ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు.
మన దగ్గర దొరికితే విచారణ చేయకూడదా?. నెల రోజులుగా మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారు. బీఎల్ సంతోష్ విచారణకు రమ్మంటే కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు చెప్పినా విచారణకు రావడంలేదు. నిన్న సభ పెట్టి బండి సంజయ్ కన్నీరుపెట్టుకున్నారో అర్థం కాలేదు. తప్పు చేయకపోతే భయమెందుకు?. దాడులకు తెలంగాణలో ఎవరూ భయపడరు. విచారణ చేసుకోండి.. అన్ని పత్రాలు చూపిస్తాము’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
Tags : 1