Breaking News

కేటీఆర్‌ కాళేశ్వరం పర్యటన ఒక విహారయాత్ర: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

Published on Fri, 07/26/2024 - 12:54

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరంపై ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ తప్పు ఒప్పుకోవాలన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. వాస్తవాలు తెలిసి కూడా తప్పును కప్పి పుచ్చుకోవడానికి విహార యాత్రగా కాళేశ్వరంగా వెళ్లారు అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.

కాగా, బీఆర్‌ఎస్‌ నాయకులు కాళేశ్వరం ప్రాజక్ట్ పర్యటనపై జీవన్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతలు కాళేశ్వరం వెళ్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. కేటీఆర్‌ కాళేశ్వరం పర్యటన ఓ విహారయాత్ర. మూడు లిఫ్ట్‌ల్లో నీటిని తరలిస్తే 30వేల కోట్లు అయ్యే ప్రాజెక్ట్‌కు లక్షా 20వేల కోట్లు చేశారు. అప్పులకు కేసీఆరే బాధ్యుడు. ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాణాత్మకంగా లోపాలు ఉన్నాయి. మూడు ప్రాజెక్ట్‌ల్లో నీటిని నిల్వ చేయకుడదని ఎన్డీఎస్‌ఏ స్పష్టం చెబుతోంది. విజిలెన్స్‌ కూడా ఇదే నివేదిక ఇవ్వబోతోంది.

వాస్తవాలు తెలిసి కూడా ఇలా విహారయాత్రకు వెళ్లినట్టు వారంతా అక్కడికి వెళ్లారు. ఒకవైపు న్యాయవిచారణ జరుగుతోంది. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్‌ అనుభవం ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకున్నాం. కానీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించడానికి ఒకేఒక అవకాశం ఉంది. మారో మార్గమే లేదు. గత బీఆర్‌ఎస్‌ వల్లే ఈ పరిస్థితి నెలకొంది. తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ల నిర్మాణానికి  మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారు. 148 మీటర్ల ఎత్తుతో నీటిని తరలిస్తే ప్రాణహిత నీళ్లు ఒక్క లిఫ్ట్‌తో ఎల్లంపల్లికి నీళ్లు వచ్చేవి. కేసీఆర్ కమీషన్ల కోసం లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)