Breaking News

AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?

Published on Fri, 05/31/2024 - 15:41

విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ  ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్‌పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. 

ఎమ్మెల్సీ  రఘురాజు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ శాసనమండలిలో  ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్‌. 

అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్‌ మోషేన్‌ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్‌, స్పీకర్‌లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ  జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది.

ఎమ్మెల్సీ రఘురాజు కొత్త డ్రామా..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)