Breaking News

SUV పైన బోటు.. అందులో ఎమ్మెల్యే.. వీడియో వైరల్ 

Published on Sat, 07/01/2023 - 20:16

లక్నో: ఇటీవల కాన్పూర్ లో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోజులు గడుస్తున్నా నిలిచిపోయిన నీటిని తొలగించడానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిరసనగా తన SUV వాహనం మీదకు బోటు ఎక్కించి అందులో కూర్చుని నగరమంతా తిరుగుతూ నిరసన తెలిపారు సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే  అమితాబ్ బాజ్ పాయ్. 

కాన్పూర్లో ఇటీవల కుండపోతగా వానలు కురిశాయి. దీంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు ఆర్య నగర్ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్ పాయ్. 

తన SUV  పైకి ఒక బోటును ఎక్కించి అందులో కూర్చుని తెడ్డు చేతపట్టుకుని నగరమంతా ఈదారు.  కాన్పూర్ లోని సరసయ్య ఘాట్ దగ్గర మొదలైన ఈ కార్యక్రమం బడా చౌరాహా, మేష్టన్ రోడ్, మూలం గంజ్ ఎక్స్ ప్రెస్ రోడ్, ఫూల్ బాగ్ మీదుగా కొనసాగించారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో వీఐపీ రోడ్, సివిల్ లైన్స్, బాబుపూర్వ, రాయ్ పూర్వలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయని ఇక జుహీ బ్రిడ్జి వద్దైతే ఆ వరద ఉధృతికి ఇటీవల ఒక డెలివరీ ఏజెంటు కూడా చనిపోయాడని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో  ప్రజలను కూడా లైఫ్ జాకెట్లు, బోట్లు వాడమని సలహా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. 

ఇది కూడా చదవండి: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు