Breaking News

లైంగిక వేధింపుల ఆరోపణలు.. టీడీపీ నుంచి ఆదిమూలం సస్పెండ్‌

Published on Thu, 09/05/2024 - 14:41

సాక్షి, అమరావతి: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు బిగ్‌ షాక్‌ తగలింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో.. ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందునే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు.

ఎంత కామాందుడు అంటే. .. నా భార్యని చిత్రహింసలు పెట్టి..


 

 

 

కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించాడని ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. తాను వేధింపులకు గురి చేసిన విషయం ఎవరికైనా చెబితే అంతం చేస్తానంటూ బెదిరించాడంటూ బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్‌ కెమెరాలో రికార్డ్‌ చేశాను. సాక్ష్యాలున్నాయనే ఎమ్మెల్యే వందసార్లు కాల్‌ చేశాడు. మెసేజ్‌లు చేసి బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే నీచ పనులకు తిరుపతి బీమా ప్యారడైజ్‌ హోటల్‌ అడ్డా. ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి అని బాధితురాలు డిమాండ్‌ చేసింది.

..ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో  పలు కార్యక్రమాల్లో ఆదిమూలం  కలిసేవారు. అలా పరిచయమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నామొబైల్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ హోటల్‌లో నుంచి రూమ్ నెంబర్ 109లోకి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను బెదిరించి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడు అని కన్నీరు పెట్టుకుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)