Breaking News

అన్ని చోట్లా నడిచినట్లు మునుగోడులో నడవనీయను: కోమటిరెడ్డి

Published on Tue, 10/14/2025 - 10:45

నల్లగొండ జిల్లా: ఎక్సైజ్ పాలసీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో ఆయన మరోసారి ప్రభుత్వ ఎక్సైజ్ విధానాలను ఎత్తి చూపారు. ఎక్సైజ్ పాలసీని మార్చాల్సిందేనని.. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే బదులు.. మెరుగు పరిచేలా ప్రభుత్వం పనిచేయాలి. వైన్ షాపుల విషయంలో మునుగోడులో తన సూచనలు పాటించాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే.. అన్ని ప్రాంతాల్లో నడిచినట్లు మునుగోడులో నడవనీయనంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మునుగోడులో ఎమ్మెల్యే నూతన నిబంధనలు
మద్యం దుకాణాలకు ఈ నెలతో గడువు ముగియనుంది. దీంతో ప్రభుత్వం కొత్తగా టెండర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అందుకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాల టెండర్లు వేయాలనుకునే వ్యాపారులు తాను సూచిస్తున్న నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఈ విషయాన్ని టెండర్లు వేయకముందే చెబుతున్నానని పేర్కొంటున్నారు.

అంతే కాకుండా నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ కార్యకర్తలను నల్లగొండ ఎక్సైజ్  కార్యాలయానికి పంపి ఎమ్మెల్యే సూచనలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌కు పంపారు. కార్యాలయం బయట ఆ సూచనల పోస్టర్‌ను ఏర్పాటు చేయించారు. తాను చేస్తున్నది ఎవ్వరి మీదనో కోపంతో కాదని.. అలా అని తాను మద్యానికి పూర్తిగా వ్యతిరేకం కూడా కాదని అంటున్నారు. కొందరు యువకులు, నడి వయస్సు వాళ్లు కుటుంబ పోషణ మరచి ఉదయం నుంచే మద్యం తాగి అనారోగ్యం బారిన పడుతున్నారని.. అలాంటి వారిని కాపాడేందుకే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నాని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు.

ఎమ్మెల్యే చేస్తున్న సూచనలు ఇవీ..
మద్యం దుకాణాలు గ్రామ శివారులో ఏర్పాటు చేయాలి.
మద్యం దుకాణంలో సిట్టింగ్‌ ఏర్పాటు చేయకూడదు
బెల్ట్‌షాపులకు మద్యం విక్రయించవద్దు
మద్యం వ్యాపారులు సిండికేట్‌ కావొద్దు
రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయించాలి
కొత్తగా టెండర్లు వేసేవారు ఈ షరతులు పాటిస్తామంటేనే టెండర్లు వేయాలని, లేదంటే టెండర్లు వేసి నష్టపోవద్దని తమ నాయకులతో సోషల్‌ మీడియాతో వైరల్‌ చేయడంతోపాటు గొడలపై పోస్టర్లు ఏర్పాటు చేయించారు. 

మరోసారి ప్రభుత్వ ఎక్సైజ్ విధానాలను ఎత్తిచూపిన రాజగోపాల్

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)