Breaking News

నాపై కాంగ్రెస్‌ వాళ్లే తప్పుడు ప్రచారం: రాజగోపాల్‌ రెడ్డి

Published on Thu, 10/30/2025 - 13:25

సాక్షి, యాదాద్రి భువనగిరి: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఖండించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పు అంటూ తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం, రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ..‘చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతున్నాం. చౌటుప్పల్ చెరువుకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు.

పార్టీ మార్పుపై.. 
పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తాను. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను,  ఎమ్మెల్యేను.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తాను. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ  నాయకుడిగా కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటా. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దు అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)