ఫ్లైయాష్‌ దందా.. ఆదినారాయణరెడ్డి వర్గీయులు కొట్లాట

Published on Mon, 01/27/2025 - 17:36

సాక్షి వైఎస్సార్‌: వైఎస్సార్‌ జిల్లాలో ఉద్రికత్త నెలకొంది. ఏపీలో ఫ్లైయాష్‌ కోసం కొట్లాట కొనసాగుతోంది. తాజాగా ఆర్టీపీపీ ఫ్లైయాష్‌ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు వారిలో వారే దాడులకు దిగారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డినట్టు సమాచారం. దీంతో, ఫ్లైయాష్‌ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. ఆర్టీపీపీ ఫ్లైయాష్‌ కోసం ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఒకరినొకరు తన్నుకున్నారు. తాజాగా ఉచితంగా వచ్చే ఫ్లైయాష్‌ను అమ్ముకునేందుకు ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్యే రగడ చోటుచేసుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రామ్మోహన్‌రెడ్డి అనే స్థానిక నాయకుడికి ఫ్లైయాష్‌ అందకుండా మరో వర్గం అడ్డుకుంది. దీంతో రామ్మోహన్‌రెడ్డి, సంజీవరెడ్డి వర్గీయుల మధ్య తీవ్రమైన వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్దతుదారులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. కర్రలతో దాడులకు తెగబడటంతో పలువురు గాయపడినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులను ఫ్లైయాష్‌ వద్దకు రానివ్వకుండా ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో రెండు జిల్లాల నేతల మధ్య పెద్ద ఎత్తున రగడ జరిగింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. అనంతరం, పలు పరిణామాల మధ్య జేసీ సైలెంట్‌ అయ్యారు. కానీ, తాజాగా ఆదినారాయణ రెడ్డి వర్గం మాత్రం ఫ్లైయాష్‌ విషయంలో మరోసారి దాడులకు దిగింది.

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ

 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)