Breaking News

దోచుకున్న డబ్బుతో కేసీఆర్‌ సభ

Published on Tue, 04/29/2025 - 06:34

నల్లగొండ: పదేళ్లు దోచుకున్న డబ్బుతో బీఆర్‌ఎస్‌.. వరంగల్‌లో సభ నిర్వహించిందని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నల్లగొండ నియోజకవర్గంలో మూడు లిఫ్టులకు, కలెక్టరేట్‌లో అదనపు బ్లాక్‌ నిర్మాణ పనులకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విప్‌ బీర్ల ఐలయ్య, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎంపీలు కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, వేముల వీరేశం, బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ పదేళ్ల కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీయించారని ధ్వజమెత్తారు. 

రైతులను ప్రోత్సహిస్తున్నాం.. 
రాష్ట్రంలో ఏడాది కాలంలో 2.89 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందని.. సన్నాలకు బోనస్‌ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. దేశంలో పేదలకు సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. అలాగే అర్హులకు రేషన్‌కార్డులు ఇవ్వడంలో బీఆర్‌ఎస్‌ విఫలమవగా తాము అర్హులందరికీ కార్డులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పగించారని.. 512 టీఎంసీలు ఏపీ తీసుకుంటే, తెలంగాణకు 299 టీఎంసీలే వచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. కానీ తామిప్పుడు 500 టీఎంసీలను తెలంగాణకు ఇవ్వాలని కొట్లాడుతున్నామని చెప్పారు. తమ పాలనలోనే ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 

నాడు సోనియా కాళ్లు మొక్కి.. నేడు కాంగ్రెస్‌ విలన్‌ అంటావా: కోమటిరెడ్డి 
తెలంగాణ ఇచ్చిన తల్లి అంటూ కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన కేసీఆర్‌ నేడు కాంగ్రెస్‌ పారీ్టనే విలన్‌ అనడం ఎంత వరకు సమంజసమని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి నేడు అదే నోటితో కాంగ్రెస్‌ను విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళితుడిని సీఎం చేస్తాన ని చెప్పి కేసీఆర్‌ మాటమార్చి మోసం చేశారని దుయ్యబట్టారు. అవినీతి డబ్బుతో మీటింగ్‌ పెట్టి కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. 

ఉత్తమ్, వెంకట్‌రెడ్డిలది సీఎం స్థాయి: రాజగోపాల్‌రెడ్డి 
కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని.. పదేళ్లు ఆయన ఏం చేశారో సమాధానం చెబుతామని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మంత్రులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం స్థాయిలో ఉన్నవారన్నారు. కోమటిరెడ్డి పదవు ల కోసం పాకులాడలేదని.. తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)