Breaking News

TS: మేమూ రామ భక్తులమే: మంత్రి ఉత్తమ్‌

Published on Sat, 01/13/2024 - 19:24

సాక్షి, సూర్యాపేట: అయోధ్యలో జరగబోయే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మం‍డిపడ్డారు. తాము కూడా రామ భక్తలమేనని గుర్తు చేశారు. శనివారం సూర్యాపేటలో పర్యటిస్తున్న సందర్భంగా ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పొలిటికల్‌ ఈవెంట్‌గా మారుస్తున్నాయని విమర్శించారు. 

‘శంకరాచార్యులు, మఠాధిపతులు కొంతమంది రామమందిర ప్రాణప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా విజయం సాధిస్తుంది. కేసీఆర్, కేటీఆర్ లాంటి వారు ఎవరు బరిలోకి దిగినా 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి యజ్ఞం మెరుగ్గా కొనసాగుతోంది. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తాం. 

అరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. గత ప్రభుత్వంలా కాకుండా, వివక్ష లేకుండా రాజకీయ పక్షపాతం లేకుండా సంక్షేమ ఫలాలు అందరికి అందిస్తాం’ అని ఉత్తమ్‌ అన్నారు. 

ఇదీచదవండి.. ఖర్గే నివాసంలో కీలక భేటీ.. ఈ రాత్రికే ప్రకటన

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)