Breaking News

తమిళ పాలిటిక్స్‌.. విజయ్‌పై ఉదయనిధి సెటైర్లు

Published on Sat, 09/27/2025 - 10:46

చెన్నై: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న నేపథ్యంలో పొలిటికల్‌ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీవీకే అధినేత విజయ్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విజయ్‌ను టార్గెట్‌ చేసిన ఉదయనిధి.. తాను వీ​కెండ్‌ పొలిటీషియన్‌ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొత్తగా ఏర్పడిన కొన్ని పార్టీలకు సిద్ధాంతం ఏమిటో తెలియదు. వారికి సిద్ధాంతం గురించి అవగాహన లేదని కనిపిస్తోంది. డీఎంకే ఎన్నికల కోసం మాత్రమే పుట్టిన పార్టీ కాదు, ప్రజల హక్కుల కోసం ఏర్పడిన పార్టీ. సీఎం ఎంకే స్టాలిన్‌కు సుమారు 60 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అనేక పోరాటాలతో ఆయన ప్రజా జీవితం నిండి ఉంది. మన సిద్ధాంతాన్ని యువతలోకి తీసుకెళ్లాలి. విద్యార్థులు, యువతతో మాట్లాడాలన్నారు.

ఇదే సమయంలో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఉదయనిధి మాట్లాడుతూ.. ‘నేను వారంలో 4-5 రోజులు అధికారిక పర్యటనలతో బిజీగా ఉంటాను. ఆదివారాల్లో కూడా పర్యటిస్తాను. కేవలం ప్రతీ శనివారం మాత్రమే బయటకు రాను. రాబోయే రోజుల్లో కొన్ని ఆదివారాలను కూడా ప్రచార కార్యక్రమానికి చేర్చుకోవాలని భావిస్తున్నా. నేను వారంలో ఏ రోజు అని చూడకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తా. కార్యకర్తలు మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి ఉండాలి' అని చెప్పుకొచ్చారు.

అలాగే, ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామిని ఉద్దేశించి.. ఆయనకు ఎప్పుడు బీజేపీ నేత, హోంశాఖ మంత్రి అమిత్‌ షానే ముఖ్యమని అన్నారు. తన సొంత పార్టీ అధినేత ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)ను కూడా మరచిపోయారని ఎద్దేవా చేశారు. ఇక, టీవీకే విజయ్‌.. ప్రతి శనివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం రోజునే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో స్టాలిన్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)